ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల 5న జరిగే పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. జిల్లాలోని 20 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మొత్తం 2,894 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటు వేయనున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 21 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలను, 20 ఎఫ్‌ఎస్‌టీ బృందాలను, 6 ఎస్‌ఎస్‌టీ బృందాలను నియమించామని తెలిపారు. సెక్టోరల్ రూట్ అధికారులు ముందుగానే వారికి కేటాయించిన మండలాల్లోని రూట్లను పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 రూట్లలో, పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పా టు చేశామని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ పంపి ణీ కేంద్రం, రిసెప్షన్ సెంటర్, ప్రవేశ ద్వారం, బయ టికి వెళ్లే మార్గంలో కూడా పోలీసు భద్రత కల్పించామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, సహాయ ఎన్నికల అధికారి, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment