వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లలమూడు నెలల బాలుడి వైద్యం కోసం రూ.20 లక్షల వరకూ వసూలు చేసి, చివరకు పసికందు మృతదేహాన్ని అప్పగించిన సంఘటన రాజమహేంద్రరం ప్రకాశం నగరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. ఈ మేరకు ఆ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం ఆందోళన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ రాజవోలుకు చెందిన ఎస్.రమణ బెలూన్ డెకరేషన్, ఈవెంట్లు చేస్తుంటాడు. రమణ దంపతులకు సంతానం కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నారు. అయితే వారికి ఏడో నెలలోనే బాబు జన్మించాడు. అతడి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ప్రకాశం నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆ శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఈ పక్రియ రెండు నెలల నుంచి జరుగుతోంది. ఈ క్రమంలో రమణ నుంచి దాదాపు రూ.20 లక్షలకు పైగా వసూలు చేశారు. ఇదిలావుండగా బాబు ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. అయితే తమకు ఇంకా వైద్యం చేసిన సొమ్ములు రూ.2 లక్షలు పైనే వస్తాయని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. కేవలం డబ్బులు కోసమే రెండు నెలలు నుంచి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలిసిన ప్రకాశం నగర్ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీనిపై ఎటువంటి పోలీసు కేసు ఇంకా నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment