ఇసుక దళారీలపై కేసులు
పెరవలి: జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద అధిక ధరలకు ఇసుక అమ్మితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ డి.నరసింహకిషోర్ హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా పెరవలి పోలీస్ స్టేషన్‌కు సోమవారం వచ్చిన ఆయన రికార్డులు పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల వద్ద దళారీలు అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేస్తే బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ర్యాంప్‌ల వద్ద దళారీలు ఉంటే ఉపేక్షించవద్దని వారిపై చర్యలు తీసుకోవాలని నిడదవోలు సీఐ, పెరవలి ఎస్సైలను ఆదేశించారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, రాత్రి గస్తీలో భాగంగా ఏడు టీమ్‌లు ఏర్పాటు చేశామని, గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొవ్వూరు డివిజన్‌లో పోక్సో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని వీటి నివారణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. పెరవలి పరిధిలో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభివించేవని అవి తగ్గిపోయి నర్లజర్ల పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయని వాటి నివారణకు చర్యలు చేపట్టామని తెలిపారు. విదేశాలకు ఉపాధి కోసం నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్లినవారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పాల్గొన్నారు.
ఎస్పీ సూచన
Comments
Please login to add a commentAdd a comment