28 వరకు క్రీడాకారుల రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డిఫరెంట్లీ అబెల్డ్ క్రికెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు నూతన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 28వ తేదీతో ముగుస్తుందని ఏసీఏ డిఫరెంట్లీ అబెల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లవల్లి సూర్యనారాయణ సోమవారం ప్రకటించారు. దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), గౌరవ కార్యదర్శి సానా సతీష్‌బాబు ఆదేశాల మేరకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ గడువు 2024 డిసెంబర్ 28వ తేదీ ముగుస్తుందన్నా రు. 30వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ తేదీని ప్రకటిస్తామన్నారు. వివరాలకు 92994 01222, 63031 39365 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
హెల్త్ అసిస్టెంట్ల తొలగింపుపై
సీఎంతో మాట్లాడతా..
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలోని హెల్త్ అసిస్టెంట్ల ఉద్యోగులను తొలగించిన విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన హెల్త్ అసిస్టెంట్ల విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జీవీవీ ప్రసాద్ ఆమె దృష్టికి తీసుకొచ్చా రు. కోర్టు తీర్పు సాకుతో ఉద్యోగాలు తొలగింపుతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన బాధలో నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుని వచ్చారు. 22 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రోడ్డున పడితే కుటుంబాలు ఎలా బతకాలని వాపోయారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్ర బాబుతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని పురందేశ్వరి హామీ ఇచ్చారు.
దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పాలియాటివ్ కేర్ ప్రోగ్రాంలో పనిచేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపాదికన నియామకాలు చేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు సోమవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. ఒక జనరల్ ఫిజీషియన్, ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమించనున్నామన్నారు. ఆసక్తి కలవారు ఈ నెల 26 నుంచి జనవరి 4వ తేదీ వరకూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు బొమ్మూరు కేశవరం రోడ్డులోని మహిళా ప్రాంగణంలోఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment