అర్జీల నమోదులో సిబ్బంది కీలకం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సమస్యలపై ప్రజలు అందించే అర్జీలను స్వీకరించి, వారికి ప్రత్యేక ఐడీతో కూడిన సంఖ్యను కేటాయించడంలో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు ప్రజల తమ సమస్యలను విన్నవించేందుకు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వస్తారన్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 172 అర్జీలు స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతి పత్రాలను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు 26 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’(పీజీఆర్‌ఎస్)కు 26 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం. మురళీకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల ఫిర్యాదులను పరిశీలించి, వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్‌ఎస్‌కు 26 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment