క్రిస్మస్ సర్వమానవాళికి పర్వదినం
ఏసుప్రభు జననంలో ఆయన చూపిన విధేయత, తగ్గింపు స్వభావం, కర్తవ్య నిర్వహణ, ప్రేమ మన జీవితంలో అలవరుచుకుని అవలంబించడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ సర్వమానవాళికి పర్వదినం. సమస్త మానవుల నిత్య జీవ ప్రాప్తికి మంచి మార్గం. క్రిస్తు జన్మం నిజమైన క్రైస్తవత్వం, ప్రేమతత్వాన్ని ప్రబోధించింది.
– మెంటే దయరాజగిరి, చైర్‌పర్సన్, మెంటే సుందరరావు మెమోరియల్ లూథరన్ టౌన్ చర్చి, నిడదవోలు)
పూర్ణ హృదయంతో ఆరాధించాలి
క్రీస్తు పుట్టుకలో దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించారు. జ్ఞానులైన వారు తాము తీసుకువచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళమును, బహుమానాలను బాలుడైన క్రీస్తుకి సమర్పించారు. పరలోకం విడిచి భూలోకమునకు వచ్చిన క్రీస్తును పూర్ణ హృదయంతో ఆరాధించాలి. మన హృదయాలను క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్.
– కోరుమిల్లి కమలాకర్, రెవరండ్ పాస్టర్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment