ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు

Published Thu, Dec 26 2024 1:43 AM | Last Updated on Thu, Dec 26 2024 1:43 AM

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (అమరావతి) నిర్వహిస్తున్న పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు తత్కాల్‌ ప్రవేశాలు కల్పిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. సాధారణ అడ్మిషన్‌ ఫీజునకు అదనంగా తత్కాల్‌ ప్రవేశ రుసుం రూ.600 చెల్లించాలన్నారు. ప్రవేశశం కోరే అభ్యాసకులు తత్కాల్‌ గడువును ఉపయోగించుకుని వెంటనే ప్రవేశాలు పొందవచ్చన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

వాజ్‌పేయి ఆదర్శప్రాయుడు

మామిడికుదురు: మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి అందరికీ ఆదర్శప్రాయుడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా మామిడికుదురు బస్టాండ్‌ కూడలిలో ఆయన చిత్రపటానికి వేమాతో పాటు ఆ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని వివరించారు. మగటపల్లిలో వాజ్‌పేయి సేవా సమితి అధ్యక్షుడు నక్కా త్రిలోచనరావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు చేతుల మీదుగా సంచార జాతులకు, విద్యార్థులకు పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెండా ఆదినారాయణ, నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement