కడియం: బుర్రిలంక ఇసుక రీచ్ వద్ద అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్లను సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేమగిరి సమీపంలోని బుర్రిలంక వద్ద గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులతో కూడిన 19 మంది టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేయరాదని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది మారడం లేదని, అటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ హెచ్చరించారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుటామని, వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. దాడుల్లో జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణరెడ్డి, ఆర్‌ఐ సోనియా, సర్వేయర్లు, వీఆర్‌ఓలు, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఎ.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment