హారన్ కొట్టినందుకు యువకుడిపై దాడి
అమలాపురం టౌన్: దారి ఇవ్వాలని హారన్ కొట్టినందుకు ఒక యువకుడిపై ముగ్గురు దాడి చేశారు. అతడి స్కూటర్‌ను ధ్వంసం చేశారు. ఈదరపల్లి వంతెన సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది. వివరాలు.. అమలాపురం రూరల్ మండలం సవరప్పాలేనికి చెందిన కమ్మసత్తి దుర్గా ప్రసాద్ స్కూటీపై ఈదరపల్లి వంతెన వైపు నుంచి వస్తున్నారు. ఈదరపల్లి గ్రామానికి చెందిన పరమట ఆనందరావు, పరమట సురేష్ (అన్నదమ్ములు), పట్టణంలోని నారాయణపేటకు చెందిన బర్లి వీర వెంకట సత్యనారాయణ అటుగా వెళుతున్నారు. ఈ సమయంలో తన స్కూటీకి వారు అడ్డుగా ఉండడంతో దుర్గా ప్రసాద్ హారన్ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన ఆ ముగ్గురు యువకులు ఇనుపరాడ్డుతో దుర్గాప్రసాద్ తలపై దాడి చేశారు. ఇది మా ఏరియా, మమ్మల్నే తప్పుకోవాలని హారన్ కొడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి స్కూటీని ట్రాక్టర్‌తో కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లి ధ్వంసం చేశారు. గాయపడిన దుర్గా ప్రసాద్ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment