అన్నవరప్పాడు వెంకన్న హుండీ ఆదాయం రూ.4.03 లక్షలు
పెరవలి: మండలంలోని అన్నవరప్పాడులో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి హుండీని బుధవారం అధికారులు, గ్రామ పెద్దల సహకారంతో తెరిచామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీలా ద్వారా రూ.3,92,383 వచ్చిందని, అన్నదాన హుండీ ద్వారా రూ.11,604మొత్తం ఆదాయం రూ.4,03,987లు వచ్చిందని ఈ ఆదాయం 48 రోజులకు అని తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, గ్రామ పెద్దలు పంతం చిన్న, పప్పొప్పు నాగేశ్వరరావు, పంతం నాగేశ్వరరావు, రంగనీటి కట్లయ్య, ఓసూరి బాల నాగేశ్వరరావు, బొలిశెట్టి ప్రసాద్ సమక్షంలో హుండీ లెక్కింపు సాగింది.
తంటికొండ వెంకన్నకు
రూ.8,37,212 రాబడి
గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీని బుధవారం అధికారులు లెక్కించారు. దేవదాయశాఖ పర్యవేక్షణాధికారి పాటి సత్యనారాయణ సమక్షంలో ఆలయంలోని హుండీలను లెక్కించగా ఐదు నెలల 15 రోజులకు రూ.8,37,212 ఆదాయం వచ్చినట్టు గుర్తించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ వడ్డాది సత్యన్నారాయణ, పాల్గొన్నారు.
అబద్ధపు వాగ్దానాలతో
కూటమికి అధికారం
పెరవలి: కూటమి ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలతో అధికారం చేపట్టిందని, అందుకు నిదర్శనం వారు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు నేటికీ అమలు చేయకపోవటమేనని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి జి.సుందర్ విమర్శించారు. పెరవలిలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు అదీ లేదు, అమ్మ ఒడి లేదు, సంక్షేమ పథకాలు లేవు, కేవలం పింఛన్ పెంచి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పడు ఆ పింఛన్ దారులను మోసగించటానికి ఏరివేత కార్యక్రమం చేపట్టారని, ఇది చాలా అన్యాయమన్నారు.
డ్రోన్లతో కషాయాల పిచికారీ
పెరవలి: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో వరిపంటపై ఆశించే తెగుళ్లను అరికట్టడానికి డ్రోన్ సహాయంతో కషాయాలను పిచికారీ చేయుస్తున్నామని సేంద్రియ వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. పెరవలి మండలం ముక్కామలలో బుధవారం వరిచేలపై కషాయాలను డ్రోన్‌తో పిచికారీని అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో 250 ఎకరాల్లో 6 డ్రోన్‌లతో ప్రకృతి వ్యవసాయం చేసే చేలకు కషాయాలను పిచికారీ చేస్తున్నామని తెలిపారు. దీని వలన రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ప్రతి వరిదుబ్బుపై మందు పిచికారీ జరిగి మంచి దిగుబడి వస్తుందన్నారు. డ్రోన్‌తో పిచికారీ చేయటం వల్ల వరిదుబ్బులు గుబురుగా పెరిగి కంకులు ఎక్కువ మొత్తంలో వస్తాయన్నారు. ముఖ్యంగా వరిపంటపై వేప గింజల పొడి, ఇంగువ, చేప బెల్లం ద్రావణాన్ని పిచికారీ చేస్తే కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగుల నివారణ అవుతుందన్నారు. డివిజన్ మోడల్ మేకర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కషాయాలు ప్రకృతి షాపుల్లో దొరకుతాయని ఈ వ్యవసాయం చేయటం ఎంతో సులభమని తెలిపారు.
బంగారుకొండ ప్లస్
కమిటీ ఏర్పాటు
రాజమహేంద్రవరం సిటీ: వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేని పిల్లలకు బంగారు కొండ ప్లస్ కిట్లు పంపిణీ చేసి, ఆరోగ్యం మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్లతో కలెక్టర్ బంగారు కొండ ప్లస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో బంగారు కొండ ప్లస్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. బంగారు కొండ ప్లస్ జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా జాయింట్ కలెక్టర్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని, కమిటీ మెంబర్లుగా డీఆర్డీఏ పీడీ, సివిల్ సప్లైస్ డీఎం,సీపీఓ, జిల్లా పంచాయతీ అధికారిని నియమించామన్నారు. కన్వీనర్‌గా మహిళా,సంక్షేమ శాఖ అధికారి వ్యవహరిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment