ఆశల వజ్రీనియా!
పురుగు మందుల
అవశేషాలు ఉండరాదు
పొగాకులో రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండరాదు. అవశేషాలపై యూరోపియన్ యూనియట్ ఆంక్షలు పెరిగాయి. అవశేషాలు ఉన్న పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి, తప్పనిసరి పరిస్థితిలో పురుగు మందులు వాడవలసి వస్తే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మందులను వాడాలి. క్యూరింగ్ చేసిన పొగాకు రంగు, నాణ్యత బాగున్నాయి. మందు పిచికారీ చేసిన 15 రోజుల వరకు ఆకు రెలుపు చేయరాదు. మొక్క తల తుంచిన తర్వాత ఎటువంటి మందులు పిచికారీ చేయకూడదు. గ్రేడింగ్ సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకుని అన్య పదార్థాలు లేకుండా చూడాలి. ఈ ఏడాది 28,719 హెక్లార్లలో పంట వేశారు. నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసి గిట్టుబాటు ధర పొందాలి.
– జీఎల్‌కే ప్రసాద్, రీజినల్ మేనేజర్,
పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం
దేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన ఎగుమతి ఆధారిత పంటగా ఉన్న వర్జీనియా పొగాకు రెలుపులు మొదలయ్యాయి. రెలుపులు జరుగుతుండడంతో తోటల్లో రెలిసిన పొగాకు క్యూరింగ్‌లు ప్రారంభమయ్యాయి. 2024–25 పంట కాలానికి గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రైతులు రెండు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకు తోటలు వేశారు. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని రైతులు తోటలను పెంచారు. తోటలు వేసే సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో నాట్లు ఆలస్యంగా వేశారు. అనంతరం వాతావరణం అనుకూలించకపోవడంతో తోటలకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. దీంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులతో తెగుళ్ల నుంచి తోటలు తేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాట్లు ఆలస్యం అయినప్పటికీ తోటలు ఆశాజనకంగా పెరగడంతో దిగుబడులు బాగుంటాయని రైతులు అనుకుంటున్నారు. తోటలు పక్వానికి రావడంతో గత రెండు వారాలుగా ముదరగా వేసిన తోటల్లో రెలుపులు మొదలయ్యాయి. అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంగా పిలిచే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పొగాకు రెలుపులు, క్యూరింగ్‌లు ఎక్కువగా జరుగుతుండగా, మిగిలిన ప్రాంతాల్లో రెండు, మూడు క్యూరింగ్‌లు జరిగినట్టు అధికారులు తెలిపారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం(మొత్తం ఐదు) కేంద్రాల పరిధిలోని ఉత్తర తేలిక నేలల్లో(ఎన్‌ఎల్‌ఎస్) రైతులు దాదాపు 50 ఏళ్లుగా వర్జీనియా పొగాకు పంట సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
రంగు, నాణ్యత ఆశాజనకం
పొగాకు రంగు, నాణ్యత ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులు, మార్కెట్లో ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి సాధించే రైతులు ఉన్నారు. సగటున ఎకరాకు 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. బ్యారన్‌కు 44 క్వింటాళ్ల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే తోటలు ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులు పెరుగుతాయని అధికారులు అంటున్నారు.
28,719 హెక్లార్లలో సాగు
రెండు జిల్లాల్లో గల ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2024–25 పంట కాలానికి 12,487 మంది రైతులు 28,719 హెక్టార్లలో పంట వేశారు. ఇది గత ఏడాది కంటే 4 వేల హెక్టార్లు అధికం. 23,575 హెక్టార్లలో పంట సాగుకు రైతులు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి మించి అదనంగా దాదాపు 5 వేల హెక్టార్లలో పంట వేసినట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఇదికాకుండా మరొక 5 వేల హెక్టార్లలో అనధికారికంగా పంట వేసినట్టు సమాచారం. ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి దాదాపు 80 మిలియన్ల కిలోలు ఉంటుందని అధికారులు, ట్రేడర్ల అంచనా వేస్తున్నారు. 58.94 మిలియన్ల కిలోల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చింది. గత ఏడాది 48.48 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 67.26 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది.
ఎగుమతి ఆధారిత పంట
ఈ ప్రాంతంలో పండించిన పొగాకు ఎగుమతి ఆధారిత పంట. ఇక్కడ పండించిన పొగాకు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి జరుగుతుంది. అంర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన పొగాకు ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో రైతులు పండిస్తున్నారు. జింబాబ్వే, బ్రేజిల్, ఇండోనేషియా దేశాల్లో పండిస్తున్న వర్జీనియా పొగాకుకు దీటుగా ఇక్కడ రైతులు నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసి గుర్తింపు పొందుతున్నారు. దీంతో పంట సాగులో రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రారంభమైన వర్జీనియా
పొగాకు క్యూరింగ్‌లు
ఆశాజనకంగా పొగాకు రంగులు
దిగుబడులపై పెరుగుతున్న నమ్మకం
28,719 హెక్టార్లలో పంట సాగు
12,487 మంది రైతులు
ఎగుమతి ఆధారిత పంట
58.94 మిలియన్ల కిలోల
ఉత్పత్తికి అనుమతి
Comments
Please login to add a commentAdd a comment