వలలో చిక్కుకుని మత్య్సకారుడి మృతి
మామిడికుదురు: పీతల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ వలలో చిక్కుకుని గోగన్నమఠం గ్రామంలోని పల్లిపాలేనికి చెందిన మత్య్సకారుడు పెసింగి బ్రహ్మయ్య (49) మృతి చెందాడు. అతడి కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేశామని ఏఎస్సై పి.కృష్ణ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి చెరువులో పీతల వేటకు వెళ్లిన బ్రహ్మయ్య బుధవారం వలలో చిక్కుకుని మృతి చెంది ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి తీవ్రగాయాలు
సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నం – రామచంద్రపురం మధ్యలో ఏటిగట్టుపై రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 24 ఏళ్ల చీకట్ల అఖిల్ తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితికి వెళ్లాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సింగవరం అంబేడ్కర్ నగర్‌కు చెందిన అఖిల్ బుధవారం తన స్నేహితుడి స్కూటీపై పురుషోత్తపట్నం వైపు నుంచి వస్తున్నాడు. అతడిని ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో రెండు వాహనాలపై ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అఖిల్ రోడ్డుపై పడిన తక్షణమే తలకు బలమైన దెబ్బ తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతడిని సీతానగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
జైలు, జరిమానా
కాకినాడ లీగల్: మద్యం తాగి బైకులు నడిపిన 11 మందికి రెండు రోజులు చొప్పున జైలు, మరో 18 మందికి జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వి.నరసింహారావు తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్ – 1, 2 పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వీరు పట్టుబడ్డారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చగా పైవిధంగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment