కేంద్రమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కంబాలచెరువు వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వరకు అమిత్ షా కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్‌వర్మ మాట్లాడుతూ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని తొలగించాలనడం దారుణమన్నారు. మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపద అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ పాలన చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా, దేశ సంపదను దోచిపెట్టడానికి వీలు లేకుండా అన్ని విధాలుగా రక్షణగా ఉంటుందన్నారు. అనంతరం కృష్ణసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పార్టీ విసృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు ప్రత ఈఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, బోడా వెంకట్, ట్రైనింగ్ ఇంచార్జ్ జంగా గౌతమ్, జిల్లా ఇన్‌చార్జి కొలనుకొండ శివాజీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment