గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజ్ ఏర్పాటు బారికేడింగ్, వేడుకలు తిలకించేందుకు వచ్చే విద్యార్థులకు గ్యాలరీల ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు వేడుకలు నిర్వహించే క్రమంలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమాహారంగా శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఇతర జిల్లా అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
జేఈఈ మెయిన్స్
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా నిర్వహించామని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. రాజమహేంద్రవరం రాజీవ్‌గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగిన పరీక్షల్లో మొదటి ిషిఫ్ట్‌లో 890 మంది విద్యార్థులకు గాను 883 మంది హాజరయ్యారన్నారు. షిఫ్ట్ 2కి 884కు గాను 878 హాజరు అయినట్లు తెలిపారు. గురువారం రెండు షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment