ఎల్‌ఐసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎల్‌ఐసీలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగాలు నియామకాలు వెంటనే చేపట్టాలని, 2020లో ఎల్‌ఐసీ ఇచ్చిన నియామక ప్రకటనలో భర్తీకాని 2,700 అసిస్టెంట్‌ల నియామకం వెంటనే చేపట్టి ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఎల్‌ఐసీ రాజమండ్రి డివిజనల్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ 85 శాతం పైన సభ్యత్వం ఉన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి గుర్తింపు ఇవ్వాలని కోరారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు ఎస్‌ఆర్ జె.మాథ్యూస్ మాట్లాడుతూ ఎంతో మంది సంస్థలో క్లాస్ 4 ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వెంటనే నియామకాలు చేపట్టడం ద్వారా వారిని కూడా శాశ్వత ఉద్యోగులుగా నియమించవచ్చని తెలిపారు. డివిజన్ ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పీఎస్‌ఎన్ రాజు, మహిళా ఉద్యోగుల కన్వీనర్ అర్.శిరీష ,శ్రీలత, రామలక్ష్మి, రమణ, జి.ఎన్.ఎల్. లక్ష్మి, డివిజనల్ యూనిట్ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఐసీఈయూ రాజమండ్రి డివిజన్
ప్రధాన కార్యదర్శి కోదండరామ్
Comments
Please login to add a commentAdd a comment