షోకాజ్ నోటీసులపై వివాదం
కాజులూరు: మండలంలోని 23 గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు తదితర 56 మందికి ఎంపీడీవో షోకాజ్ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం మండలంలోని 23 గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి ఎంపీడీఓ జె.రాంబాబు సమావేశం నిర్వహించారు. దీనికి పంచాయతీ కార్యదర్శులు మినహ ఇతర శాఖల సిబ్బంది పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఆదేశాల మేరకు తాను సమావేశం ఏర్పాటు చేశారని, దీనిపై సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం విధులకు గైర్హాజరు కావడమేని, దీనిపై 24 గంటలలో సమాధానం ఇవ్వకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని వారికి ఎంపీడీఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై వివిధ శాఖల సిబ్బంది మాట్లాడుతూ ఎంపీడీవో తమపై కక్షధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్రావు, సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీసర్వే పైలెట్ ప్రాజెక్టు పనుల్లో రెవెన్యూ సిబ్బంది బిజీగా ఉన్నామని, సమావేశం జరిగిన సమయంలో కోలంకలో విధులు నిర్వహిస్తున్నామన్నారు. తాము విధుల్లో ఉన్నప్పటికీ ఎంపీడీఓ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.
అలసత్వం తగదంటున్న ఎంపీడీవో
ఆయన తీరు సరికాదంటున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment