మద్యం దుకాణంతో మూడు గ్రామాలకు ఇబ్బందులు
కై కలూరు: మద్యం దుకాణం ఏర్పాటుతో మూ డు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారంటూ సోమవారం వదర్లపాడు గ్రామంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వదర్లపాడు శ్మశాన వాటిక సమీపంలో రైస్‌మిల్లు వద్ద మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా సర్పంచ్ వడుపు లక్ష్మీ నాగదేవి ఆధ్వర్యంలో ని రసన తెలిపారు. వదర్లపాడు, నరసాయిపాలెం, శీతనపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారని, ఇటుగా విద్యార్థులు పాఠశాలలకు వెళతారన్నారు. సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. విషయం తెలిసిన కై కలూరు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ ఎస్‌కే రమేష్, ఎస్సై ఆదినారాయణ ఇక్కడకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు.
‘చింతలపూడి’ నిర్వాసితుల ఆందోళన
ఏలూరు (టూటౌన్): చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలని, ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ ముల విలువ పెరుగుతున్నా తొమ్మిదేళ్లు క్రితం ప్రకటించిన అవార్డును ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణం అన్నారు. తక్కువ పరిహారం ఇస్తూ అన్యాయం చేయాలనుకోవడం సరికాదన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు ఎస్.వరలక్ష్మి, కుప్పాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
వేతన బకాయిలు చెల్లించాలి
నూజివీడు: ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, ఆయాలకు, నైట్ వాచ్‌మెన్‌లకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఏఐసీసీటీయూ) జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఏఐసీసీటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన, శానిటేషన్, నైట్‌వాచ్ మెన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అఖిలభారత ప్రగతి శీల మహిళా సంఘం సభ్యురాలు పల్లిపాము భవాని, కార్మికులు పాల్గొన్నారు.
పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 వరకు ఫీజులు చెల్లించవచ్చని, రూ.50 ఫైన్ తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 9 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 16 వ రకు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులు రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలని, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం రూ.125తో పాటు అదనంగా రూ.80 చెల్లించాలని సూచించారు.
‘ఓపెన్’ ప్రవేశాలకు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో (2024–25) ప్ర వేశాలకు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు రూ.600 అపరాధ రుసుంతో ఈనెల 25 వరకు గడువు ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment