చట్టాలపై అవగాహన అవసరం
పోలవరం రూరల్: ఎస్సీ, ఎస్టీ చట్టాలపై పూర్తి అ వగాహన కలిగి ఉండాలని ఏపీ సీఐడీ రాజమండ్రి డీ ఎస్పీ వై.శ్రీనివాసరావు అన్నారు. పట్టిసం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం–1989పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాలు గురించి, వాటి నుంచి చట్టరీ త్యా ఎలా రక్షణ లభిస్తుందో తెలుసుకోవాలన్నారు. కేసుల్లో అరెస్టులు జరిగినా ట్రయిల్ సమయంలో సాక్ష్యం సరిగా చెప్పకపోవడంతో శిక్షలు పడటం లేదన్నారు. ఎస్టీలకు చట్టరీత్యా రక్షణ, హక్కుల గురించి వివరించారు. తహసీల్దార్ ఆర్‌ఎస్ రాజు మాట్లా డుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం గురించి తెలియజేశారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లా డుతూ ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ప్రత్యేక చట్టాల గురించి వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాసబాబు, అ డ్వకేట్ ఎస్.ఆనందరావు, మొడియం శ్రీనివాస రావు, రాజశేఖర్‌బాబు సీఐ బాలసురేష్, ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment