వెల్లుల్లి అ‘ధర’హో
అలసత్వం వహిస్తే చర్యలు
పోలీసు సిబ్బంది సమష్టిగా పనిచేసి నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని, విధుల్లో అలసత్వం సహించమని పశ్చిమగోదావరి ఎస్పీ హెచ్చరించారు. 8లో u
తాడేపల్లిగూడెం: ఉల్లి ఘాటు నుంచి ఉపశమనం పొందుతున్న తరుణంలో వినియోగదారులకు వెల్లుల్లి ధరల శరాఘాతం తగిలింది. వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా రకాన్ని బట్టి కిలో రూ.450కు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి ఎక్కువగా వెల్లుల్లి మార్కెట్లకు సరఫరా అవుతాయి. సింహభాగం మధ్యప్రదేశ్ నుంచి వెల్లుల్లి వస్తుంది. ఆ రాష్ట్రంలో వెల్లుల్లి హబ్‌గా పేరొందిన వేప, మందసౌర్, రత్లాం ప్రాంతాల నుంచి సరఫరా ఉంటుంది. సుమారు 3.1 మిలియన్ టన్నుల వెల్లుల్లి మార్కెట్లకు వస్తుంటాయి. సాధారణంగా సెప్టెంబరు నుంచి అధికంగా కొత్త వెల్లుల్లి మార్కెట్‌కు వస్తుంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దిగుబడులు 70 శాతం వరకు పడిపోయాయి. ఈ ప్రభావం ధరలపై పడింది. ప్రస్తుతం గూడెం మార్కెట్‌లో విడిగా కిలో వెల్లుల్లి పెద్దవి రూ.450, చిన్నవి రూ.360 నుంచి రూ.400కు విక్రయిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో పెద్ద వెల్లుల్లి కిలో రూ.420, చిన్నవి రూ.320కు విక్రయిస్తున్నా యి. కొత్త పంట వచ్చే వరకూ ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
గూడెంలో వందే భారత్‌కు హాల్టు !
తాడేపల్లిగూడెం: వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్టు కల్పించనున్నారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు రైల్వే అధికారులు సర్వే పూర్తిచేశారు. గూడెం స్టేషన్ ఏ క్లాస్ పరిధిలో ఉంది. రోజుకు సగటున రూ.3 లక్షల వరకూ ఆదాయం ఉంది. హాల్టుకు సంబంధించి నివేదికలన్నీ పంపామని తాడేపల్లిగూడెం రైల్వే అధికారి జి.దానయ్య తెలిపారు.
కిలో రూ.400 పైమాటే
Comments
Please login to add a commentAdd a comment