బియ్యం వివరాలు నమోదు చేయాలి
ఏలూరు (మెట్రో): రైసు మిల్లులకు వచ్చిన ధాన్యం వివరాలు అలాగే సీఎంఆర్ బియ్యం వివరాలను సంబంధిత రిజిస్టర్‌లో నమో దు చేసి ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో త ప్పనిసరిగా చూపించాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఖరీఫ్ ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.182.06 కోట్ల విలువైన 79,900 టన్నుల ధాన్యాన్ని 10,628 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లా లో 99 సార్టెక్స్ రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. జి ల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ 08812–230448, 7702003584, టోల్ ఫ్రీ 18004256453 నంబర్లు ఏర్పాటుచేశామన్నారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment