జనవరిలో హేలాపురి బాలోత్సవం
ఐదో బాలల సంబరాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే జనవరి 24, 25 తేదీల్లో నిర్వహించే హేలాపురి బాలోత్సవం ఐదో పిల్లల సంబరాలు విజయవంతం కావాలని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ అన్నారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో బాలోత్సవం కరపత్రాలను ఆహ్వాన సంఘం ప్రతినిధుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పెద్దలు హేలాపురి బాలోత్సవం పేరుతో పిల్లల సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించేలా అందరూ తోడ్పాటు అందించాలన్నారు. విద్యాలయాల ప్రతినిధులు ప్రోత్సహించి బాలోత్సవంలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. అడుసుమిల్లి నిర్మల, ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు పిల్లల సంబరాల నిర్వహణకు తోడ్పడిన విధంగా ఈసారీ సహకరించాలని కోరారు. బాలోత్సవాన్ని వట్లూరులోని సిద్ధార్థ ఫెస్ట్ స్కూల్‌లో నిర్వహించడానికి కమిటీ నిర్ణయించిందన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరుకావాలని కోరారు. వీజీఎంవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐదో బాలోత్సవం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమాన్ని ఆహ్వాన సంఘం నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు సమన్వయం చేశారు. కమిటీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, పీడీ రత్నాకర్‌రావు, ఎస్.కస్తూరిరావు, వి.సురేష్, ఎ.మోహిని పద్మజావాణి, మేతర అజయ్‌బాబు, ఎస్‌ఎస్ కట్టా. పి.కనకదుర్గా, ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment