ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డ్రైవింగ్ లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించవద్దని జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎస్‌సీ సెంటర్లు, ఈ–సేవల ద్వారా నిర్ణీత రుసుం చెల్లించి రవాణా సేవలు పొందవచ్చని పే ర్కొన్నారు. వాహనాలకు వాహన్.పరివాహన్, డ్రై వింగ్ లైసెన్సులకు సారథి.పరివాహన్ వెబ్‌సైట్ల ద్వారా మొబైల్ ఫోన్, కంప్యూటర్లను వినియోగించుకుని ప్రజలు సేవలు పొందవచ్చని తెలిపారు. తమ కార్యాలయంలో పౌర సమాచార కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నామని, రవాణా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే సెల్ 91542 94210, 91542 94105 నంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment