చెడు వ్యసనాలకు లోనై బైక్‌ల చోరీ
ద్వారకాతిరుమల : చెడు వ్యవసనాలకు లోనై, డబ్బు కోసం బైక్‌లను చోరీ చేస్తున్న ఒక విద్యార్థిని స్థానిక ఎస్సై టి.సుధీర్ ద్వారకాతిరుమల శివారులో శుద్ధగనుల వద్ద గురువారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్టేషన్‌లో భీమడోలు సీఐ యుజే విల్సన్, ఎస్సై సుధీర్ వివరాలను వెల్లడించారు. కాకినాడ (యానాం రోడ్డు)లోని డ్రైవర్స్ కాలనీకి చెందిన 20 ఏళ్ల సంగిరెడ్డి వీర గణేష్ వర్మ కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఏలూరులోని ఒక హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిస అయిన అతడు సులువుగా డబ్బు సంపాదించేందుకు బైక్‌ల చోరీ పాల్పడుతున్నారు. శ్రీవారి దర్శనార్ధం ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల బైక్‌లను మాయం చేస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన ఎస్సై సుధీర్ నిందితుడు వీర గణేష్ వర్మను అరెస్టు చేసి, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు (హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హీరో గ్లామర్) బైక్‌లు క్షేత్రంలో, మరో (హీరో స్ప్లెండర్ ప్లస్) బైక్ విజయవాడ బస్టాండ్ వద్ద దొంగిలించినవిగా నిర్ధారించారు. ఇదిలా ఉంటే నిందితుడు వీర గణేష్ వర్మ గతంలో ఉండి పోలీస్టేషన్‌లో పట్టుబడినట్టు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment