జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ ఇవ్వాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెసిడెన్షియల్ శిక్షణ కారణంగా ఉపాధ్యాయుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, మారుమూల ప్రాంతాల్లో శిక్షణలతో అనారోగ్యం పాలవుతున్నారని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ శిక్షణను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏలూరు డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల ఆగిరిపల్లిలో నిర్వహించిన రెసిడెన్షియల్ శిక్షణలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా తాజాగా గురువారం విజయనగరం జిల్లా గజపతినగరంలో జరుగుతున్న రెసిడెన్షియల్ శిక్షణలో మరో ఉపాధ్యాయుడు కన్నుమూయడం బా ధాకరమన్నారు. ప్రభుత్వం ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఎంత మంది ఉపాధ్యాయులను బలి తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిరిపల్లి సంఘటన తర్వాత జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు దానిని పక్కన పెట్టి దూరప్రాంతాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర అ న్యాయం జరుగుతుందన్నారు. హామీ మేరకు ఇకపై శిక్షణ కార్యక్రమాలను జిల్లా కేంద్రాల్లో, నాన్ రెసిడెన్షియల్‌లో మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, బీ టీఏ, ఏపీటీఎఫ్ 1938, ఆపస్, డీటీఎఫ్, ఎస్‌టీ యూ, ఎన్‌టీఏ, ఏపీఎస్‌టీఏ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment