పేరెంట్స్ మీటింగ్‌కు కోడ్ పట్టదా!
భీమవరం: ఎమ్మెల్సీ ఎ న్నికల నిబంధనలకు వి రుద్ధంగా మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్ డిసెంబర్ 7న నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. అలాగే 7న సుబ్రహ్మణ్య షష్ఠి కావడంతో సమావేశాలు ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. 5న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా.. 12 వరకు కోడ్ అమలులో ఉంది. ఈ సమయంలో కొత్తగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం లేదు. అయితే మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్ అట్టహాసంగా నిర్వహించాలని, స మావేశాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతోపాటు 9వ తేదీ నుంచి విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల ముందు సమావేశాలు పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణ కోసం మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆగిరిపల్లి, రాజానగరంలో శిక్షణ ఇవ్వడంతో పాఠశాలల్లో బోధనా నిర్వహణ కష్టమవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. విద్యార్థులకు పరీక్షల సమయంలో తమకు అదనపు బా ధ్యతలు అప్పగిస్తే ఎలా అని ఉపాధ్యాయులు అంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, సంక్షేమ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మొత్తంగా 1,375 పాఠశాలల్లో మీటింగ్ నిర్వహించాలని స్వయంగా పశ్చి మగో దావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలివ్వడంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
7న సమావేశం నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశం
12 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
ప్రజాప్రతినిధులతో సమావేశాలపై అభ్యంతరాలు
వాయిదా వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
Comments
Please login to add a commentAdd a comment