30న పింఛన్ల పంపిణీ
ఏలూరు(మెట్రో): ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30న లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ కె.వెట్రి సెల్వి టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని, ఏదైనా కారణంతో ఆ రోజు తీసుకోని వారికి సో మవారం పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో 2,62,836 మంది లబ్ధిదారులకు రూ.112.68 కోట్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతలను 5,298 మంది సిబ్బందికి అప్పగించామన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ కార్య క్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ, జెడ్పీ సీఈఓ ఆర్.విజయరాజు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏ సభ్యుడిగా అబ్బినేని
ఏలూరు (టూటౌన్): జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్ ఏ) సభ్యుడిగా అబ్బి నేని విజయకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చైర్మన్‌గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కార్యదర్శిగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఉంటారు. వీరితో పాటు కమిటీలో కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. తాజాగా ప్రభుత్వం సభ్యుడిగా విజయ్‌కుమార్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం ఏలూరు బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా అబ్బినేని మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించటానికి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తానని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో న్యాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హెల్ప్ కౌంటర్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయాల్లో ‘మే ఐ హెల్ప్ యూ’ కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు జిల్లా రిజిస్ట్రార్ కె. శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే దస్తావేజుకి సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూ జర్ చార్జీల వివరాలు ప్రతి కార్యాలయంలో పట్టిక రూపంలో ప్రదర్శించాలని ఆదేశించా మని పేర్కొన్నారు. ప్రజలు నిషేధిత ఆస్తుల జాబితా, రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువల తెలుసుకునేందుకు ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్, సబ్ రిజిస్ట్రార్ లేదా జిల్లా రిజిస్ట్రార్‌లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
వ్యక్తిత్వ వికాసంపై అవగాహన
ఏలూరు రూరల్: స్థానిక శనివారపుపేట జెడ్పీ హైస్కూల్‌లో శనివారం వ్యక్తిత్వ వికాసంపై సెట్‌వెల్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్‌వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచనలు ఉన్నతంగా ఉండాలన్నారు. కష్టించి పనిచేయడం, నిజాయితీగా వ్యవహరించడం, ఉత్తమ ఫలితాల సాధించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సమాజంలో ఉన్నత వ్యక్తుల గురించి తెలుసుకోవాలని, ప్రత్యేక ప్ర ణాళికతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు మాట్లాడుతూ సృజనాత్మకతకు అధిక ప్రాధాన్యముందని, వినూత్న ఆలోచనలు, ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు అందుకోవచ్చన్నారు. హెచ్‌ఎం ప్రభాకర్‌రావు, సెట్‌వెల్ మేనేజర్ పీవీఎన్ సత్యనారాయణ, కేజే కెన్నడీ తదితరులు పాల్గొన్నారు.
దుంపగడప గేటు మూసివేత
ఆకివీడు: మరమ్మతుల దృష్ట్యా ఈనెల 30 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ మండలంలోని దుంపగడప గ్రామంలోని రైల్వే గేటు (మొండి గేటు)ను మూసివేస్తున్నట్టు కై కలూరు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గురువారం ఓ ప్రక టనలో తెలిపారు. దుంపగడప–ఆకివీడు రో డ్డులో లెవిల్ క్రాసింగ్ నెం.95 రైల్వే గేటును శనివారం ఉదయం 7 గంటలకు మూసివేస్తామ న్నా రు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment