ఏలూరు టౌన్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించటంతో పాటు ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రత, సౌకర్యాల కల్పన విషయంలో సత్ఫలితాలు సాధించిన పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని తాడేపల్లిగూడెం, నూజివీడు ఏరియా ఆస్పత్రులు పురస్కారాలు పొందాయి. రాష్ట్రంలోనే బెస్ట్ ఏరియా ఆస్పత్రులుగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్ర భుత్వ ఆస్పత్రుల పనితీరు, శుభ్రత, ఆరోగ్య సేవల విషయంలో ఆస్పత్రులకు ప్రభుత్వం ప్రథమ, ద్వితీయ కేటగిరీల్లో అవార్డులు, న గదు బహుమతులు అందజేస్తుంది. గురువా రం ఈ అవార్డులను ప్రకటిస్తూ ప్రభుత్వం జా బితాను విడుదల చేసింది. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి బెస్ట్ ఏరియా ఆస్పత్రిగా 97 మార్కులు సాధించి రూ.10 లక్షలు, నూజివీడు ఏరియా ఆస్పత్రి ద్వితీయ స్థానంలో 94.63 మార్కులు సాధించి రూ.7.5 లక్షలు న గదు బహుమతులను కై వసం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment