సేవలు షట్‌డౌన్
అప్పు చేసి వైద్యం
పేరుపాలేనికి చెందిన ఎన్.వెంకట్రావుకు నెల రోజుల క్రితం గుండెపోటు రాగా రేషన్, హెల్త్ కార్డులు తీసుకుని విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. స్టెంట్ వేయాల్సిన అవసరం ఉందని చెప్పిన వైద్యులు హెల్త్‌కార్డులో వెంకట్రావు పేరు లేకపోవడాన్ని గుర్తించి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయలేమని చెప్పారు. మార్పులు చేర్పులు చేసేందుకు వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో ఆయన రూ.3 లక్షలు అప్పు చేసి హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు.
సాక్షి, భీమవరం: కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం సైట్లను ఓపెన్ చేయకపోవడంతో ఆయా సేవలు, పథకాలకు సంబంధించిన దర ఖాస్తులు అప్‌లోడ్ చేసే వీలు లేకుండా పోయింది. ఎన్నికల వాగ్దానాల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు తదితర వాటికి సంబంధించి మార్గదర్శకాలు ఇవ్వలే దు. దీంతో వాటి కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో నిర్ణీత రోజుల్లో పరిష్కారమయ్యే ఆయా సేవలు ఇప్పుడు నెలలు గడుస్తున్నా అందక పేద వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల ముందు మూతపడ్డ ప్రభుత్వ వెబ్‌సైట్లు
ఆరు నెలలు గడిచినా ఆప్షన్లు ఓపెన్ చేయని కూటమి సర్కారు
అప్‌లోడ్ కాని దరఖాస్తులు
నిలిచిన రేషన్ కార్డు, పింఛన్, హెల్త్ కార్డుల మంజూరు
పేదలకు అందని పెళ్లి కానుక, బీమా తదితర పథకాలు
దరఖాస్తుల స్వీకరణకు నిరాకరిస్తున్న అధికారులు
ప్రభుత్వ సాయం అందకపేదల అగచాట్లు
రేషన్ కార్డులు ఎప్పుడో?
బియ్యం కార్డులకు సంబంధించి సైట్ ఓపెన్ కాక కొత్త కార్డుల మంజూరు, పుట్టిన పిల్లలను కార్డులో చేర్చడం, చనిపోయినవారి పేర్ల తొ లగింపు ప్రక్రియ నిలిచిపోయింది. అక్షర దోషాలకు సంబంధించి కరెక్షన్లు కావడం లేదు. కేవలం వలస కార్మికుల దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
హెల్త్ కార్డులు దూరం
అత్యవసర వైద్యసేవల సమయంలో పేద వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఎంతో భరోసానిచ్చేవి. సాంకేతికపరమైన ఇబ్బం దులు ఎదురైనా వెంటనే సరిచేసి వైద్యసేవలు అందించేందుకు వీలుండేది. ప్రస్తుతం ఈ సైట్‌లోని పలు ఆప్షన్లు ఇంకా క్లోజ్‌లోనే ఉండటంతో వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
బీమాకు లేదు ధీమా
సాధారణ, ప్రమాద రూపంలో ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ద్వారా గత ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. సాధారణ మరణం అయితే రూ.లక్ష, ప్రమాద బీమా అయితే రూ.5 లక్షలు సాయం అందించేది. మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.10 వేలు అందించేవారు. ఈ పథకం పాలసీ గడువు జూన్ 31తో ముగిసిపోయింది. సాధారణ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.10 లక్షలు బీమా సా యం అందిస్తామని గతంలో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు.. ఇంకా సైట్ కూడా ఓపెన్ చేయలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా అనేక బాధిత కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment