భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మధ్యాహ్నం నుంచి స్పెషలిస్టులు రావడం లేదని ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం ఆమె జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్పత్రుల పర్యవేక్షణ నిమ్తితం జిల్లాలోని 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా హాస్పిటల్స్, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక జిల్లా హాస్పటల్‌కు మొత్తంగా 64 మంది ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment