ఎస్పీకి ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ నోటీసులు
ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులను దారుణంగా కొట్టడమేకాకుండా కులం పేరుతో దూషించిన లెక్కల టీచర్ ఎంఎన్‌వీ ముత్యాలరావుపై అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆయనపై చర్యలు తీసుకోలేదని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్‌కు ఈ నెల 6న బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్ ఎస్పీకి మంగళవారం నోటీసులు జారీ చేశారు. తన పిల్లలను ఉపాధ్యాయుడు ముత్యాలరావు కొట్టి, కులం పేరుతో దూషించారని, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం సహకారంతో తల్లిదండ్రులు జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాలుడు త్రివిక్రమ్ ఎడమ కాలు విరిగిందని.. ఉపాధ్యాయుడి వల్ల పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక సహస్రను సైతం కొట్టి దూషించిన ముత్యాలరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఎంఈఓ, ఎస్‌ఐ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment