రైతులను మోసగించిన బాబు
కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి
చంద్రబాబు నాయుడు నిజం చెప్పడని.. ఆయన నిజం చెబితే తలకాయ వెయ్యి చెక్కలవుతుందని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆనాడే చెప్పారు. రైతు భరోసా సాయంగా రూ.13,500 రైతులకు జగన్ మోహన్‌రెడ్డి అందించేవారు. అధికారంలోకి వస్తే రూ. 20 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారు. బీమా చేయని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దళారీ వ్యవస్థకు చంద్రబాబు ఆజ్యం పోయడంతో రైతులు నష్టపోతున్నారు. ఇన్‌పుట్ సబిడ్సీ, రైతు భరోసా, బీమా వంటి వాటికి ఎగనామం పెట్టారు. మన పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వాటిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
మిల్లర్లదే రాజ్యం
కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి
వర్షాలతో పంట మునిగి, రంగు మారిన ధాన్యంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు నేటి వరకు పెట్టుబడి సాయం కింద ఒక్క రూపాయి ఇవ్వలేదు. మిల్లర్లు చెప్పినట్లు ఆడేలా వ్యవస్థను చంద్రబాబు మార్చేశారు. సివిల్ సప్లయిస్ మినిస్టర్ ఉన్నా, ఆ శాఖ కంట్రోల్ అంతా ఉపముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన అండగా నిలబడుతుంది. ఒక్క రూపాయి విద్యుత్ చార్జీలు పెంచమని ప్రజలను నమ్మించి మోసం చేసి వేల కోట్ల రూపాయల భారం మోపారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకానికి కూడా తూట్లు పొడిచారు.
Comments
Please login to add a commentAdd a comment