ఏలూరు(మెట్రో): రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 657 గ్రామాల్లో ఈ నెల 11 నుంచి జనవరి 8 వరకు జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి అర్జీని స్వీకరించాలన్నారు. మనమందరం ప్రభుత్వ ఉద్యోగులమని నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలన్నారు. సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు నిబద్ధతతో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి సదస్సుకు కలెక్టర్ నియమించిన నోడల్ అధికారులందరూ హాజరుకావాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ సైట్‌లో ఫిర్యాదు తక్షణ నమోదు చేపట్టాలన్నారు. మ్యుటేషన్ సేవను చేపట్టడానికి సంబంధిత రిజిస్టర్ తీసుకెళ్లాలన్నారు. గ్రామాన్ని రెవెన్యూ సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సదస్సులు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment