ఏలూరు టౌన్: ఏలూరు అశోక్‌నగర్‌లోని మిషనరీ వసతి గృహంలో బాలిక ప్రసవం... నవజాత శిశువును బయటకు విసిరివేయడంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ సంఘటనపై సమగ్ర నివేదికను మూడు రోజుల్లో రాష్ట్ర కమిషన్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్ విజయవాడ నుంచి మాట్లాడుతూ... ఈ సంఘటనను బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నివేదిక అధారంగా బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. బాలికల వసతిగృహాలకు సంబంఽధించి వసతిగృహం నిర్వహకులు, అక్కడి సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో బాలల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment