పిండ మార్పిడి సక్సెస్
పిండ మార్పిడితో పోడూరులో ఆవు ఒంగోలు జాతి పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఈ పక్రియ కోసం ఆచంట పశువైద్యాధికారి చేస్తున్న కృషి ఫలించింది. 8లో u
పోలీసులకు చెబితే రివర్స్‌లో వార్నింగ్
ప్రతి రోజూ జిల్లాలో సగటున 10 నుంచి 20 వరకు కోడిపందేలు, వారంలో ప్రతి నియోజకవర్గంలో రెండుసార్లు భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారనేది జిల్లాలో పోలీసులతో సహా అందరికీ తెలిసిన విషయమే. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోనే జిల్లా ఎస్పీ ఉంటారు. ఎస్పీ కార్యాలయానికి సమీపంలోని గ్రామాల్లోనే పందేలు జోరుగా సాగుతున్నాయి. గత నెల 29న భీమవరం రూరల్ మండలంలో దిరుసుమర్రులో భారీగా పందేలు తెల్లవారుజాము వరకు నిర్వహించారు. స్థానికంగా పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చినా.. వాట్సప్ గ్రూపుల్లో కోడిపందేల వీడియోలు పోస్టు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.
కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగానే పోలీసుల నుంచి వార్నింగ్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో పందేనికి ఫిక్స్‌డ్ రేటు నిర్ణయించి మరీ కింది స్థాయి నుంచి ఒక స్ధాయి వరకు పోలీసులకు ముట్టచెబుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్ధితి. వాస్తవానికి కోడిపందేల నిర్వాహకులు, కత్తుల తయారీ నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళతో ఆ దిశగా దృష్టి సారించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment