రెవెన్యూ అధికారుల సర్వే
కొయ్యలగూడెం: కన్నాపురంలో చెట్ల నరికివేతపై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. 28న సాక్షిలో ప్రచురితమైన ‘చెట్లు నరకవద్దంటూ గ్రామస్తుల ఆందోళన’ శీర్షికకు స్పందించిన ఉన్నతాధికారులు సమగ్ర సర్వే చేపట్టాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో వీఆర్‌వో, రెవెన్యూ సిబ్బంది యర్రాయిగూడెం రోడ్డులో నరికి వేతకు గురైన చెట్లను పరిశీలించి భూఆక్రమణలకు సంబంధించిన అంశంపై గ్రామస్తుల ఆరోపణ మేరకు సర్వే చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులు పుంత రోడ్డును ఆక్రమించారని అదేవిధంగా స్మశాన వాటికకు వెళ్లే దారిని కూడా ఆక్రమించారంటూ అధికారుల వద్ద ఫిర్యాదు చేశారు. పూర్తి సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వీఆర్‌వో సుబ్బారావు పేర్కొన్నారు.
గ్రౌండ్ ట్రూతింగ్ సర్వేపై సమీక్ష
ఏలూరు(మెట్రో): కొల్లేరు సరస్సుకు సంబంధించి 2022–23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తయిన పిదప గ్రౌండ్ ట్రూతింగ్‌కు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్షించారు. గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే చేపట్టేందుకు ఉన్న అవసరత, సాంకేతిక సామర్ధ్యాలు తదితర అంశాలు శాసీ్త్రయంగా ఉండేలా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశం అనంతరం గ్రౌండ్ ట్రూతింగ్ సర్వేకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలు ప్రారంభం
ఏలూరు టౌన్: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి తుది ఎంపికలకు రంగం సిద్ధం చేశారు. గతంలో ఎంపికల్లో ప్రాథమిక రాత పరీక్షలు పూర్తి చేయగా... తాజాగా దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఏర్పాట్లను శనివారం రాత్రి పర్యవేక్షించారు. ఈ నెల 30 నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దేహదారుఢ్య పరీక్షలు జనవరి 9 వరకూ కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 4,976 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు మంజూరు చేశామని తెలిపారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా జన వరి 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పోటీల్లో డిస్ క్వాలిఫై అయితే ఈవెంట్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఒక రోజు ముందే పెన్షన్లు
ఏలూరు(మెట్రో): ఎన్టీఆర్ భరోసా పింఛన్లు డిసెంబర్ 31న అందిస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. డిసెంబర్ 31న ఫించన్లు తీసుకోని వారికి జనవరి 2న పంపిణీ చేస్తామన్నారు. మంగళవారం జనవరి నెల పెన్షన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జనవరిలో 2,62,228 మందికి రూ.113.01 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 31న 100 శాతం పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ఫించన్ పంపిణీకి నిర్దేశించిన 5,298 మంది సిబ్బంది తప్పకుండా ఆ రోజు ఉదయం 6 గంటలకు పంపిణీ ప్రారంభించాలన్నారు.
దివ్యాంగుల పింఛన్ల
ఏరివేతకు కుట్ర
అత్తిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పింఛన్ల వెరిఫికేషన్ పేరుతో అనేక సాకులు చూపించి ఏరివేసేందుకు కుట్ర చేస్తుందని వైఎస్సార్‌సీపీ దివ్యాంగ విభాగం జిల్లా అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. జనవరి నుంచి మే వరకు పింఛన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ నెపంతో సదరం సర్టిఫికెట్లు జారీ నిలుపుదల చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం దారుణమన్నారు. సదరం సర్టిఫికెట్ జారీ నిలుపుదల వల్ల దివ్యాంగులు ఇబ్బందులు పడతారని, ఐదు నెలలు పాటు జారీ నిలుపుదల చేశారని, పింఛన్ల మంజూరు ఎప్పటికి చేస్తారోనని దివ్యాంగులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment