ఆకలి తీర్చే | - | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చే

Published Sun, Dec 29 2024 12:39 AM | Last Updated on Sun, Dec 29 2024 12:39 AM

ఆకలి

ఆకలి తీర్చే

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినూత్న సేవా కార్యక్రమం

ప్రతినెలా 3వ మంగళవారం విద్యార్థుల నుంచి బియ్యం సేకరణ

ప్రతి నెలా వంద నుంచి 120 కేజీల వరకు సేకరణ

5 కేజీల చొప్పున ప్యాకింగ్‌ చేసి పేదలకు అందజేస్తున్న విద్యార్థులు

రెండున్నరేళ్లుగా నిరాటంకంగా నిర్వహణ

సాక్షి, భీమవరం : విద్యార్థుల్లో సేవా దృక్పథం, మానవత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ దోసెడు బియ్యం విధానానికి శ్రీకారం చుట్టారు. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌క్రాస్‌ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం ఇతరులకు ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి నెలలో ఒక రోజున తమ ఇంటి నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటుచేసిన డ్రమ్‌లో వేస్తారు. సేకరించిన మొత్తాన్ని నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

బ్యాగులుగా చేసి పేదలకు పంపిణీ

ఏదైనా నెలలో ఆరోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యాగులుగా ప్యాక్‌ చేసి గ్రామంలోని మార్కెట్‌ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్‌ ప్రిన్సిపల్‌ పి.మధురాజు, కామర్స్‌, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్‌ సీహెచ్‌ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్‌ బాక్సులో బియ్యం నింపి తమకు ఇస్తారని, వారు ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఇది పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు.

గణపవరంలోని ఎస్‌సీహెచ్‌వీపీఆర్‌ కళాశాలలో దోసెడు బియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
ఆకలి తీర్చే1
1/1

ఆకలి తీర్చే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement