శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మద్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణ మంగళవారం ఉదయం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ డీఈఓ బాబురావు స్వామి వారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు.
అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు
ఏలూరు(మెట్రో): ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 7 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగియనుండటంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. జనవరి 7 వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 11 వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 17న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారన్నారు.
యూరియా రాక
తాడేపల్లిగూడెం రూరల్: దాళ్వా సీజన్‌కు సంబంధించి 2,670 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎరువుల ర్యాక్‌లను ఏడీఏతో కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment