మావుళ్లమ్మ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
డీఆర్వో వెంకటేశ్వర్లు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉత్సవాలపై ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి ఆయన కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఈనెల 13 నుంచి వచ్చేనెల 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అమ్మవారి జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లకు సహాయ, సహకారాలు అందించాలని కో రారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మా ట్లాడుతూ 60 ఏళ్లుగా జాతరను నీరుల్లి, కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఫిబ్రవరి 14 భారీ అన్నసమారాధన రోజున ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్రెడ్డి, జిల్లా దేవదాయ శాఖ అధికారి వీ.సుబ్బారావు, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీనగేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆక్వా చెరువులకు లైసెన్సులు తప్పనిసరి
ఉంగుటూరు: చేపలు, రొయ్యల చెరువులకు రైతులు లైసెన్సులు పొందాలని రావులపర్రు ఫిషరీస్ సహాయకుడు సత్యనారాయణ తెలిపారు. పాత లైసెన్సు ఉన్నవారు ఎండార్స్మెంట్ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుంటే విద్యుత్ సబ్సిడీ రాదన్నారు. కొత్త లైసెన్స్ కోసం నెలాఖరు వరకు గడువు ఉందని చెప్పారు. అప్సడా యాక్ట్ సలహాలు, సూచనల కోసం సెల్ 9492876543 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment