పెద్దరావిగూడెం పాఠశాల పరిశీలన
కుక్కునూరు: మండలంలోని పెద్దరావిగూడెంలోని ఎంపీయూపీ పాఠశాలను శుక్రవారం తె లంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌టీవీ శ్రీనివాస్ పరిశీలించారు. శ్రీనివాస్ స్వగ్రామం పెద్దరావిగూడెం కావడంతో ఇక్కడకు వచ్చిన ఆయన పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు తక్షణ సాయం కింద చెక్కు అందించారు. ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆయన్ను సత్కరించి మెమెంటో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేట్ విధానాలతో ప్రజలకు అన్యాయం
భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలకు తీవ్ర అ న్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం 26వ జిల్లా మహాసభ లను శుక్రవారం భీమవరంలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విజన్‌లో కేవలం కార్పొరేట్ వర్గాల తప్ప రైతులు, శ్రామికులు, కార్మికులు, ఉద్యోగులు, పేదలు లేరని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అమలులో రనౌట్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యదర్శి బి. బలరామ్ మాట్లాడుతూ పచ్చని పశ్చిమగోదా వరి జిల్లా కాలుష్య గోదావరిగా మారిందని ఆ వేదన వ్యక్తం చేశారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వ ర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్, చింతకాయల బాబురావు, బి.వాసుదేవరావు పాల్గొన్నారు.
6న గ్రామ సభలు
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారుపై ఈనెల 6న గ్రామసభలు నిర్వహించనున్నట్టు ఎకో సె న్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టుపక్కల ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఆకివీడులో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.
నేడు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
భీమవరం: వీరవాసరంలోని ఎంఆర్‌కే జెడ్పీ హైస్కూల్‌లో శనివారం జరిగే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని సర్వశిక్షా అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాం సుందర్, జిల్లా సైన్స్ అధికారి వీఎంజెడ్ శ్యాంప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఏర్పాటుచేసిన పలు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాస్థాయికి ఎంపికై న ఎగ్జిబిట్స్‌ను సకాలంలో ఏర్పాటుచేసి ప్రదర్శించాలని కోరారు.
భూసేకరణ వేగిరపర్చాలి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎన్‌హెచ్–165కి సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పామర్రు–దిగమర్రు ఎన్‌హెచ్–165 భూ సేకరణలో భాగంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన భూములకు సంబంధించి భూసేకరణ అధికారి భీమవరం ఆర్డీఓ తయారుచేసిన అవార్డులపై విచారణ నిర్వహించారు. భూ సేకరణ కొలతలు, భూ యజమానుల పేర్లు తప్పుల సవరణ ఫిర్యాదుల స్వీకరణకు ఒక తేదీని ఖరారు చేసి గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ల్యాండ్ సూపరింటెండెంట్ సీహెచ్ రవికుమార్, ఎన్‌హెచ్–165 ఏఈ ఖాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment