● దారంతా మంచు తెరలు
సోమవారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీంతో రహదారులపై ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక శోభనాచలుడి కొండ మంచు తెరల్లో చూడముచ్చటగా ఉంది. వరాహ పుష్కరిణిని పొగముంచు కమ్మేసి సరోవరాన్ని తలపించింది. మంచు కురిసిన సమయంలో విజయవాడ, నూజివీడు రహదారుల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దారి కనబడనంతగా మంచు కురవడంతో వాహనదారులు వాహనాల హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. – ఆగిరిపల్లి
వరాహ పుష్కరిణిని కమ్మేసిన పొగ మంచు
Comments
Please login to add a commentAdd a comment