శ్రీవారి గోసంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి గోసంరక్షణ పథకానికి ఒక భక్తుడు సోమవారం రాత్రి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన రేపక రవీంద్రకుమార్, చంద్రశేఖర్ ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ సూపరింటెండెంట్ హయగ్రీవ విరాళం బాండ్ పత్రాన్ని అందించారు.
హామీలను విస్మరిస్తే ఉద్యమిస్తాం
మంత్రి లోకేష్‌కు ఏబీవీపీ హెచ్చరిక
భీమవరం: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం దారుణమని ఏబీవీపీ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భీమవరం పర్యటనకు వచ్చిన లోకేష్‌కు ఏబీవీపీ నాయకుడు కాయిత డిన్నుచందు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తల్లికి వందనం, జీవో నంబర్ 77 రద్దు చేయడం వంటి అంశాలు వాయిదా వేస్తూ కాలం వెళ్లదీయడం వల్ల విద్యార్థులు ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రస్తుత ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ములను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రతన్ టాటా ఆదర్శనీయుడు
పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శనీయుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో ఏర్పాటుచేసిన రతన్ టాటా విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం భీమవరం పట్టణం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment