నూతన కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (టూటౌన్): స్థానిక గిరిజన భవనంలో నిర్వహించిన ఏపీ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు రీజియన్ ద్వైవార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు రీజియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్.లక్ష్మణరావు, డిప్యూటీ రీజినల్ కార్యదర్శిగా బావనరు షి, దివ్య రజిని, కోశాధికారిగా ఎస్‌కే ఉస్మాన్, అసిస్టెంట్ కార్యదర్శిగా ఎస్.చంద్రశేఖర్ మరో 10 మంది కమిటీ సభ్యులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాలే శ్రీనివాసరావు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఉదయ్‌కుమార్ తదితరులు మాట్లాడారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ లక్ష్మణరావు సోమవారం సమావేశం నిర్ణయాలను మీడియాకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment