మూసేవరకూ పోరాడతాం
తేతలిలో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసే వరకు పోరాటం ఆపేదిలేదని గోసేవా సమితి సభ్యులు స్పష్టం చేశారు. 8లో u
తణుకు అర్బన్: ప్రభుత్వ ఒత్తిడితోనే ఇటీవల గేదె మాంసం ఎగుమతులు పెంచామని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజరు అరవింద్ సరీన్ అన్నారు. శనివారం తణుకు చిట్టూరి హెరిటేజ్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఏర్పాటుకు 2014– 18లో తేతలి పరిధిలో అనుమతులు పొందామని, ఫ్యాక్టరీ నిర్మాణంతోపాటు అవసరమైన సామగ్రిని ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం తమకు వచ్చే రెవెన్యూతోపాటు స్థానికంగా ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో తమ తీవ్ర ఒత్తిడి చేస్తుందని, అందువల్ల మాంసం ఎగుమతులకు కావాల్సిన గేదెలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ అనుమతులు, స్థానికంగా వచ్చే సమస్యలతో తమకు అవసరంలేదని.. ఫ్యాక్టరీ నిర్మించే సమయానికి ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేవని స్పష్టం చేశారు. అన్ని విభాగాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతోనే తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని.. ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా లీగల్‌గా వ్యవహరిస్తామని సంస్థ మూసే ప్రసక్తేలేదని అన్నారు.
30న పదోన్నతులకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు వివిధ పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌లో పదోన్నతులు కల్పించడానికి సంబంధించిన సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జాబితాలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం ఏలూరు విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఈ నెల 30న రావాలని సూచించారు. సదరు ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల లోపు సంబంధిత సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిస్టర్‌తో హాజరు కావాలని సూచించారు.
ప్రభుత్వ ఒత్తిడితోనే మాంసం ఎగుమతులు పెంచాం
లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ జీఎం అరవింద్ సరీన్
Comments
Please login to add a commentAdd a comment