ఏపీ క్రాస్ కంట్రీ జట్టు కోచ్‌గా సంకు, మేనేజర్‌గా కేతా
తణుకు అర్బన్ : ఆంధ్రప్రదేశ్ క్రాస్ కంట్రీ జట్టుకు కోచ్‌గా మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణ, మేనేజర్‌గా వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేతా మునీంద్రరావులను ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ నియమించింది. ఈనెల 12న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించే జాతీయస్థాయి క్రాస్‌కంట్రీ పోటీల్లో పాల్గొనే ఏపీ జట్టుకు వీరు కోచ్, మేనేజరుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.
చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా
నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నిడమానూరుకు చెందిన వేగి బేబీ సరోజినికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.35 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడులోని స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పును వెలువరించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఏ సీతారామపురంనకు చెందిన మయార పూర్ణచంద్రరావు బేబీ సరోజినికి 2015, 2016, 2017 సంవత్సరాల్లో మూడు దఫాలుగా రూ.30 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ తీర్చమని పూర్ణచంద్రరావు అడగగా 2017లో బేబీ సరోజిని ఒక్కొక్కటి రూ.10 లక్షలు చొప్పున మూడు చెక్కులు ఇచ్చింది. వాటిని బ్యాంకులో వేయగా బేబీ సరోజని ఖాతాలో నగుదు లేదని చెక్కులు వెనక్కు వచ్చాయి. దీనిపై పూర్ణచంద్రరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం బేబీ సరోజినికి స్పెషల్ మేజిస్ట్రేట్ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
మద్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
భీమవరం : కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ కె బలరామరాజు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కారులో మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి పోలీసులు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కారును తనిఖీ చేసి, 25 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న కొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, కొలపర్తి వెంకటేశ్వరరావు, కంచుస్తంభం కాళేశ్వరరావులను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. కాగా ఖరీదైన మద్యం సీసాల్లో లోకల్ మద్యం వేసినట్లు ప్రాథమికంగా గుర్తించి మద్యాన్ని రసాయన పరీక్షల కోసం కాకినాడు ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ పీబీ సత్యనారాయణ, బలరామరాజు, ఎస్సై సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రాయలం గ్రామానికి చెందిన ఎ.రవీంద్రకుమారి (37) ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గొల్లవానితిప్పరోడ్డులోని ప్రకాష్‌నగర్‌కు చెందిన ఆమె గత 15 రోజులుగా రాయలంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. మృతురాలు తండ్రి కృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment