అంతర్జాతీయ స్కేటర్ జెస్సిరాజ్‌కు పురస్కారం
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన స్కేటర్ మాత్రపు జెస్సిరాజ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. ఆమె తల్లిదండ్రులు సురేష్, రాధా గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయవాడ ఎన్‌ఎంఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జెస్సి రాజ్‌కు చిన్ననాటి నుంచి స్కేటింగ్‌పై ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు కోచ్ సింహాద్రి వద్ద ఆమెకు శిక్షణ ఇప్పించారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో 50 పథకాలను జెస్సిరాజ్ సాధించింది. ఈ సంవత్సరం ఆసియా కప్ ప్రపంచ కప్ పోటీల్లో సైతం విజయం పతాకం ఎగురవేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఓషియాన పసిఫిక్ కప్ చాంపియన్ షిప్– 2024లో ప్రపంచ క్రీడాకారులను వెనక్కి నెట్టి దేశానికి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2025కు సిఫార్సు చేశారు. డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెస్సిరాజ్‌కు అవార్డును ధ్రువీకరణ పత్రాన్ని అందజేయగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment