మహిళలకు అండగా ‘అభయ’
ఏలూరు టౌన్: అభయ పోలీస్ మహిళా రక్షక దళంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అభయ ప్రచార రథాన్ని ఏలూరు అమీనాపేట సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లిష్‌మీడియం స్కూల్ వద్ద విద్యార్థులతో కలిసి ఎస్పీ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఎస్పీ శివకిషోర్ అభయ టీమ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆపద సమయంలో జిల్లాలోని మహిళలు టోల్‌ఫ్రీ నెంబర్లు 112 లేదా 1098 లేదా 1930కు సమాచారం ఇవ్వాలని, వెంటనే పోలీస్ సిబ్బంది మీకు అండగా నిలబడతారన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై క్రాంతిప్రియ, ఆర్‌ఎస్సై నరేంద్ర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment