విచ్చలవిడిగా నాటుసారా
మెట్ట ప్రాంతంలో సారా ఏరులై పారుతోంది. చాలా గ్రామాల్లో సారా కుటీర పరిశ్రమగా తయారైంది. దీంతో కూలీలు, కార్మికులు సారాకు బానిసలవుతున్నారు. 8లో u
డ్రెయినేజీ
సమస్యకు మోక్షం
ఆకివీడు: ఆకివీడు పట్ట ణంలో ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రె యిన్లు అధ్వానంగా ఉండటంపై ‘పండుగ రో జుల్లో మురుగునీటి సరఫరా’ శీర్షికను ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి నగర పంచాయతీ కమిషనర్ జి.కృష్ణమోహన్ స్పందించారు. జాతీయ రహదారిపై స్థానిక ఐబీపీ పెట్రోల్ బంక్ వద్ద డ్రెయినేజీ అ ధ్వానంగా ఉండటంతో అపార్ట్‌మెంట్లలోని మురుగునీరు రోడ్లపైకి వచ్చి వర్షం నీటిని త లపిస్తోంది. సోమవారం స్థానిక ఐబీపీ పె ట్రోల్ బంకు ప్రాంతాలను కమిషనర్ కృష్ణమోహన్ పరిశీలించి మురుగునీరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న డ్రెయిన్లపై ప్లేట్లను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే డ్రెయినేజీలో మురుగునీరు, సిల్టులు తొలగించారు. దీంతో సమస్య కొంతవరకు పరిష్కారమైందని, శాశ్వత చర్యలు చేపట్టాలని స్థాని కులు గొట్టుముక్కుల జానకీరామరాజు, కొ ప్పర్తి రవికుమార్ కోరారు. హైస్కూల్ నుంచి మూలలంక కాల్వ వరకూ డ్రెయిన్ నిర్మించేందుకు అధికారులు అంగీకరించినట్టు తెలిసింది. నాయకులు గొట్టుముక్కల వెంకట సత్య నారాయణరాజు, మోటుపల్లి ప్రసాద్ తది తరులు ఇక్కడకు చేరుకుని సమస్యను కొలిక్కి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment