పింఛన్ కోసం పాట్లు
ఈమె పేరు సింగులూరు నర్సమ్మ జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం. ఆమె భర్త 2023 నవంబర్‌లో మృతి చెందగా.. తన భర్తకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను తనకు కేటాయించాలని ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మీకోసంలో కలెక్టర్‌కు తన గోడు చెప్పుకుందామని వచ్చి ఓపిక లేక కలెక్టరేట్ ఆవరణలో నీరసనంతో ఇలా పడిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లే ఇంటికి వచ్చి దరఖాస్తు పూర్తిచేసి పింఛన్ అందించేవారని, ఇప్పుడు కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ స్పందించడం లేదని వాపోయింది.
స్ట్రెచర్‌పైనే కలెక్టరేట్‌కు..
ఈయన పేరు డి.తిరుపతినాయుడు పెదవేగి మండలం తాళ్లగోకవరం. ఏడాది క్రితం చెట్టు ఎక్కి ప్రమాదానికి గురై నడుము, రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. అప్పు చేసి చికిత్స చేయించినా జీవితకాలం నిలబడే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు. తనకు పింఛన్ మంజూరు చేయాలని ఏడు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. దీంతో కలెక్టరేట్‌లో మీకోసం జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌కు తన గోడు చెబుదామని ఇలా స్ట్రెచర్‌పై బంధువుల సాయంతో వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment