అదిగో.. ఇదిగో అంటున్నారు..
ఈ వృద్ధురాలి పేరు కొలాల వజ్రావతి ఏలూరు మంచినీళ్లతోట ప్రాంతం. వృద్ధాప్య పింఛన్ కోసం సంవత్సరం క్రితం దర ఖాస్తు చేసుకున్నానని, ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిరిగినా ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప పింఛన్ మంజూరు కాలేదని అన్నారు. కనీసం కలెక్టర్‌ను కలిసి సమస్య చెబితే పరిష్కరిస్తారేమోనని ఇక్కడకు వచ్చానన్నారు.
ఏ పథకమూ అందక..
ఈమె పేరు పోకల నా గమణి ఏలూరు పడ మరవీధి. ఆమె ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాలే దని అధికారుల వద్ద ఆరా తీస్తే తన పేరుపై ఒక భవనం, 10 మీటర్లు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయింది. తనకు సెంటు భూమి లేదని, కరెంటు మీటర్లు లేవని వాపోయింది. కలెక్టర్‌ను కలిసి సమస్య చెబుతానని ఆమె చెప్పింది.
ఏడాదిగా తిరుగుతున్నా..
ఈ వృద్ధుడి పేరు కట్టా మహాలక్ష్మణుడు ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి. ఆయన 2024 జనవరిలో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికీ పింఛన్ మంజూరు కాలేదు. మొదట్లో ఎన్నికల కోడ్ అని, ఇప్పుడు సైట్ ఓపెన్ కాలేదని చెబుతున్నారని అన్నారు. ఏలూరులో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment