సూర్యఘర్ యోజనతో మేలు
విద్యుత్ ఎస్‌ఈ సాల్మన్‌రాజు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ పి.సాల్మన్‌రాజు అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్‌లో పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన (సోలార్ రూఫ్‌టాప్) పథకంపై సోలార్ వెండర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసు కున్న విద్యుత్ వినియోగదారులను కలిసి సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన వారికి బ్యాంకుల నుంచి రుణ సహకారం అందించాలని సూచించారు. ఎక్కువ సోలార్ రూఫ్‌టాప్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి దేశంలోనే ఏలూరు జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేఎం అంబేడ్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టెక్నికల్ పి.రాధాకృష్ణ, జిల్లా సోలార్ నోడల్ ఆఫీసర్ ఎ.రమాదేవి, 18 కంపెనీల సోలార్ వెండర్స్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment